🌍 అబ్రాడ్ లొ లైఫ్స్టైల్ తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఎన్నో ఆశలతో, ఆతృతతో, భవిష్యత్తు కలలతో విదేశాలకు వెళ్లిన మనవాళ్లు అక్కడ ఎలా జీవిస్తున్నారు? మీరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే, ఈ కథనం మీకోసం.

📅 రోజు లైఫ్స్టైల్ ఎలా ఉంటుంది?

విదేశాలలో ఎక్కువ మంది తెలుగు వారు స్టూడెంట్స్, వర్క్ వీసా హోల్డర్స్, డిపెండెంట్ వ్యక్తులు, లేదా పెద్దలుగా పిల్లలను చూడటానికి వచ్చినవారు.

  • జాబ్స్ ఉన్నవాళ్లు పనిలో బిజీగా ఉంటారు.
  • స్టూడెంట్లు యూనివర్సిటీకి వెళ్లిన తర్వాత పార్ట్‌టైం జాబ్స్ చేస్తారు.
  • రోజంతా డ్యూటీ చేసి ఇంటికి వచ్చేసరికి, కాలమే మిగలదు.
  • వీకెండ్స్ వస్తే మాత్రం బయట టూర్‌లు, సినిమా లు, పిక్నిక్‌లు, షాపింగ్—ఇలా రిఫ్రెష్ అవుతారు.

🚗 ట్రావెల్ & ట్రాన్స్ పోర్ట్

విదేశాల్లో మనం ఇక్కడ బైక్ వాడినట్టే, వారు కార్లు ఎక్కువగా వాడతారు.

  • కారు ఉన్నవాళ్లు – ఎప్పుడైనా అవసరం వచ్చినా ప్రయాణించటం సులువు.
  • కారు లేనివారు – పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఆధారపడతారు.
  • UK, AUS, US, CANADA లాంటి దేశాల్లో బస్సులు, ట్రైన్లు చవకగా లభించినప్పటికీ, టైమింగ్స్ ఫిక్స్‌డ్. ముఖ్యంగా దూరప్రాంతాల్లో ఉంటే ఓన్ ట్రాన్స్ పోర్ట్ చాలా అవసరం అవుతుంది.

🍛 ఆహారం & మార్కెట్లు

ఇక్కడ మాదిరిగా మూడు పూటలా అన్నం తినే పరిస్థితి లేదు.

  • ఎక్కువగా లంచ్ + డిన్నర్ చేస్తారు.
  • బ్రేక్‌ఫాస్ట్ అంటే oats, cereals లాంటి తేలికపాటి వాటే.
  • కూరగాయలు అంతగా లభించవు. అందుకే:
    • కొన్నివి ఫ్రోజెన్ స్టోర్లలో మాత్రమే దొరుకుతాయి.
    • ఇండియన్ గ్రాసరీలు ఉండే ప్రాంతాల్లో కొంత భద్రత ఉంటుంది.

🎓 స్టూడెంట్ జీవితం: స్వర్గమా? సవాలా?

అబ్రాడ్ వెళ్ళే ఎక్కువ మంది యువత స్టూడెంట్స్.

  • షేర్డ్ హౌస్‌లు, ట్రాన్స్ పోర్ట్ ట్రబుల్స్, పార్ట్‌టైమ్ జాబ్స్—ఇవి వారి దైనందినం.
  • బంకులు, రెస్టారెంట్లు, కొరియర్, ఉబర్ డ్రైవింగ్ వంటి పనులు చేసి యూనివర్సిటీ ఫీజు, ఇంటి ఖర్చులు, బిల్‌ల కోసం శ్రమించాల్సి వస్తుంది.
  • అయితే దీని వలన సెల్ఫ్ డిసిప్లిన్, పట్టుదల పెరిగి, మాస్టర్స్ తర్వాత మంచి ఉద్యోగాలకు దారితీస్తుంది.

❌ కానీ అందరూ అలా కాదు. కొంతమంది కాసినో, బెట్టింగ్ వంటి వ్యసనాలకు బానిసలై, డబ్బులు పోగొట్టుకొని అప్పుల్లో మునిగి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

👨‍👩‍👧‍👦 వర్క్, డిపెండెంట్, పేరెంట్ వీసా జీవితం

వర్క్ వీసా లేదా డిపెండెంట్ వీసాతో వెళ్లినవాళ్లకు పరిస్థితులు కొంతమేర తగ్గినవే.

  • వీరికి ఇంట్లో అనుభవం, తెలిసినవాళ్లు ఉండడం వలన ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
  • కానీ కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది.

🎉 పండుగలు

ఏ దేశమైనా సరే, మన తెలుగు వాళ్లు కమ్యూనిటీగా ఏర్పడి పండుగలు ఘనంగా జరుపుకుంటారు:

  • వినాయక చవితి, ఉగాది, దీపావళి, దసరా – అన్నీ అక్కడ కూడా జరుపుతారు.
  • సిటీకి దూరంగా ఉండే వారు ఒకే చోట కలుసుకుని potluck-style (ఒక్కొక్కరు వంటలు తెచ్చి) జరుపుకుంటారు.
  • పిల్లలు, పెద్దలు కలిసి ఇంట్లో లా పండుగ వాతావరణం తీసుకొస్తారు.

🫂 చివరి మాట:

విదేశాల్లో జీవితం అంటే కేవలం డాలర్లు, కార్లు, శుభ్రంగా ఉండే వీధులు మాత్రమే కాదు. ఒంటరితనంతో, పని ఒత్తిడితో, తినే తిండి లోపంతో, కలల్ని నెరవేర్చేందుకు చేసే పోరాటంతో నిండినదే.

❝ఎన్ని దేశాలు పోయినా, ఎంత సంపాదించినా, అవసరానికి తోడుగా ఉండే మనవాళ్లే కావాలి. ❞
ఈ పంక్తులు గుర్తు పెట్టుకోండి:

“ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము”
— రాయప్రోలు సుబ్బారావు

1 thought on “🌍 అబ్రాడ్ లొ లైఫ్స్టైల్ తెలుసుకోవాలనుకుంటున్నారా?”

  1. Pingback: Australia Visa?

Leave a Comment