2025 ఆస్ట్రేలియా లాటరీ వీసా – భారత పౌరులకు

2025 ఆస్ట్రేలియా లాటరీ వీసా ఆస్ట్రేలియా జీవితాన్ని అనుభవించడానికి గోల్డెన్ ఛాన్స్

ఆస్ట్రేలియా వీసా రావడంలేదని  ఆందోళనలో ఉన్నారా?

ఆస్ట్రేలియా లాటరీ వీసా

ఆస్ట్రేలియా లాటరీ వీసా/వర్కింగ్ హాలిడే వీసా గురించి ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు ఇది భారత పౌరులకు కూడా అందుబాటులో ఉంది! భారత ప్రభుత్వం మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం మధ్య Migration and Mobility Partnership Arrangement (MMPA) ఒప్పందంతో, భారత యువతకు సంవత్సరానికి 1,000 వీసాలు లభించనున్నాయి.

వర్కింగ్ హాలిడే వీసా అంటే ఏమిటి?

వర్కింగ్ హాలిడే వీసా – Subclass 462 ద్వారా మీరు:

  • 12 నెలలు ఆస్ట్రేలియాలో ఉండవచ్చు
  • పార్ట్ టైం లేదా ఫుల్ టైం పని చేయవచ్చు
  • 4 నెలల వరకు చదువుకోవచ్చు
  • దేశం నలుమూలలా తిరుగుతూ ఆస్ట్రేలియన్ జీవనశైలిని అనుభవించవచ్చు.

భారత పౌరులకు ఏమిటి  ప్రత్యేకం?

ఇంతకు ముందు ఈ వీసా భారత పౌరులకు లభ్యం కాకపోయినా. భారత్, చైనా, వియత్నాం వంటి దేశాల నుండి అధిక డిమాండ్ ఉండడంతో, ఎవరు అప్లై చేయచ్చో ఎంపిక చేయడానికి ఆస్ట్రేలియా ముందస్తు లాటరీ విధానమైన బాలట్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. 2023లో జరిగిన ఒప్పందంతో జులై 1, 2024 నుండి సంవత్సరానికి 1,000 మందికి అవకాశం లభిస్తుంది.

ఈ ప్రక్రియ బ్యాలట్ లాటరీ విధానంలో జరుగుతుంది.

బ్యాలట్ (Ballot) విధానం ఎలా పనిచేస్తుంది?

ఆస్ట్రేలియా లాటరీ వీసా

  • జూన్ 24 నుండి జూలై 15, 2025 మధ్యలో రిజిస్ట్రేషన్ ఉంటుంది. అభ్యర్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు
  • ఎంపికైనవారికి ఇమెయిల్ ద్వారా ఆహ్వానం వస్తుంది
  • ఆ తర్వాతే వీసా అప్లికేషన్ దాఖలు చేయొచ్చుచేసుకోవచ్చు

అర్హత ప్రమాణాలు

మీరు:

  • 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి
  • చెల్లుబాటు అయ్యే భారత పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి
  • కనీసం 12 తరగతి విద్యను పూర్తి చేసి ఉండాలి
  • ఇంగ్లీష్ భాషాలో అర్హత చూపాలి
  • కనీసం AUD $5,000 సేవింగ్స్ మరియు తిరిగి వచ్చే టికెట్‌కు నిధులు ఉండాలి
  • ఆరోగ్యం & నైతికత పరీక్షలు పాస్ కావాలి

అప్లికేషన్ లింక్: immi.homeaffairs.gov.au

ఎలాంటి పనులు చేయవచ్చు?

ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చు:

  • హోటల్స్ & రెస్టారెంట్లు
  • ఫార్మింగ్, పండ్ల కోత
  • టూరిజం
  • రిటైల్
  • డెలివరీ & వేర్‌హౌస్

📌 ఒకే నైతికతగా 6 నెలల వరకే ఒకే ఎంప్లాయర్ వద్ద పని చేయవచ్చు.

ఎక్కడ నివసించవచ్చు?

మీకు ఇష్టమైన ఏ నగరంలోనైనా నివసించవచ్చు:

  • సిడ్నీ
  • మెల్బోర్న్
  • బ్రిస్బేన్
  • అడిలైడ్
  • టాస్మానియా
  • రీజిరీజినల్  ప్రదేశాలు (వీసా పొడిగింపుకు ఉపయోగపడతాయి).

వీసా గడువు & పొడిగింపు

మొదటి వీసా: 12 నెలలు వరకు ఉంటుది. రెండవ లేదా మూడవ సంవత్సరం పొడిగించుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు రిజినల్ ఏరియాలలో ఫార్మింగ్, టూరిజం వంటి తదితరుల ప్రత్యేకమైన పనులు చేస్తే.

వీసా ఖర్చు & ప్ప్రోసెసింగ్

  • వీసా ఫీజు: ~AUD $635 (బ్యాలట్ ద్వారా ఎంపికైన వారికి మాత్రమే)
  • ప్రాసెసింగ్ సమయం: 1–2 నెలలు (డిమాండ్ ఆధారంగా మారవచ్చు).

డిపెండెంట్స్ (భార్య, పిల్లలు) తో రావచ్చా?

రాలేరు, ఈ వీసా ద్వారా మీరు డిపెండెంట్స్‌ను తీసుకురాలేరు. ఈ వీసా ఒక్కరిగా అప్లై చేసుకునే వారికి మాత్రమే.

చివరి మాట

ఆస్ట్రేలియాలో పని చేస్తూ దేశాన్ని తిరగడంఇది ఒక గొప్ప అవకాశం!
భారత యువతకు ఇది జీవితం మార్చే అనుభవం అవుతుంది. మాస్టర్స్‌కి ముందుగా బ్రేక్ తీసుకోవాలనుకునేవారికి, విదేశీ అనుభవం కావాలనుకునేవారికి ఇది బంగారు అవకాశం.

Disclaimer:

LifeAbroad360 వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మేము బాధ్యత వహించము. ఈ బ్లాగ్‌ సమాచారం అందించడం కోసం మాత్రమే; ఇది చట్టపరమైన లేదా మైగ్రేషన్ సలహా కాదు. మేము ప్రస్తుత సమాచారాన్ని మీకు అందించడానికే మా ప్రయత్నము కానీ, భవిష్యత్తులో జరిగే మార్పులు, అప్డేట్స్  పై మేము హామీ ఇవ్వలేము. మీ వ్యక్తిగత పరిస్థితికి తగిన సలహా కోసం, దయచేసి నిజమైన రిజిస్టర్డ్ మైగ్రేషన్ ఏజెంట్ లేదా లైసెన్స్ కలిగిన వ్యక్తులని సంప్రదించండి. https://lifeabroad360.com/%E0%B0%85%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8A-%E0%B0%B2%E0%B1%88%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%88%E0%B0%B2%E0%B1%8D