ఆస్ట్రేలియా అని చెప్పగానే మనకు వెంటనే కనిపించే దృశ్యాలు ఏమిటంటే — ఎండ కాసే బీచ్‌లు, ఎర్ర రంగు ఎడారులు, తీరం వెంట దృశ్యాలు, ఇంకా కంగారూలే! కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, “ఆస్ట్రేలియాలో మంచు పడుతుందా?” సమాధానం — అవును, ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో మంచు పడుతుంది, అది కూడా ఎక్కువగా శీతాకాలంలోనే. చాలా వరకు మన తెలుగు వాళ్ళు అమెరికా, కెనడా, యూరప్ దేశాల లో లాగా మంచు కురుస్తుందని అనుకుంటారు కానీ అలా భావించే వారికి ఆస్ట్రేలియా గురించి పూర్తిగా తెలీదనే చెప్పాలి.
మీరు టారిస్ట్, స్టూడెంట్ లేదా ఇతర వీసాలలో వచ్చి ఉంటే ఆస్ట్రేలియాలో ఎక్కడ మంచు పడుతుందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
🌨️ ఆస్ట్రేలియాలో మంచు పడే కాలం ఎప్పుడు? – When is the snow season in Australia?
ఆస్ట్రేలియాలో చాలా ప్రాంతాలు వేడిగా మరియు పొడిగా ఉంటాయి. జూన్ నుండి ఆగస్ట్ వరకు ఉండే శీతాకాలంలో మాత్రమే కొన్ని కొద్ది ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. ముఖ్యంగా south-eastern Highlands ప్రాంతాల్లో మంచు ఎక్కువగా కనిపిస్తుంది.
వేసవి రాష్ట్రాల్లో నివసించే ప్రజలు కుటుంబం, స్నేహితులతో కలిసి మంచును ఆస్వాదించేందుకు ఈ ప్రాంతాలకి వెళ్లటం చాలా సాధారణం.
🏔️ ఆస్ట్రేలియాలో ఎక్కడ మంచు పడుతుంది? – Where Does It Snow in Australia?
రాష్ట్రాల వారీగా మంచు పడే ప్రముఖ ప్రాంతాల ఇవే:
🗻 1. Snowy Mountains (న్యూ సౌత్ వెల్స్)
పెరిశర్ (Perisher) మరియు త్రెడ్‌బో (Thredbo) ఆస్ట్రేలియాలోనే ప్రసిద్ధమైన స్కీ రిసార్ట్లు. ఇవి కోజియస్‌కో నేషనల్ పార్క్ (Kosciuszko National Park) లో ఉన్నాయి, మరియు ప్రతి శీతాకాలంలో కచ్చితంగా మంచు కురిసే ప్రాంతాలు ఇవే
- కాన్బెరా (Canberra)
- కూమా (Cooma)
- జిందబైనె (Jindabyne)
లాంటి నగరాలు వీటికి దగ్గరగా ఉంటాయి.
🏂 2. Victorian Alps (విక్టోరియా)
మౌంట్ హోతామ్ (Mount Hotham), మౌంట్ బుల్లర్ (Mount Buller), ఫాల్స్ క్రీక్ (Falls Creek) వంటి ప్రాంతాల్లో మంచు పర్వతాలు కనిపిస్తాయి. ఇవి పర్యాటకులకే కాకుండా, హోటల్స్, ఫుడ్ సర్వీస్, స్కీ ఇన్స్ట్రక్టర్లు వంటి ఉద్యోగ అవకాశాలకూ ప్రసిద్ధి.
ఇక్కడికి దగ్గరగా ఉండే నగరాలు:
- మెల్బోర్న్ (Melbourne)
- ఆల్బరీ (Albury)
- బ్రైట్ (Bright)
ఇతర ప్రాంతాలు: లేక్ మౌంటెన్, మౌంట్ డోన్నా బువాంగ్, మౌంట్ బా బా
❄️ 3. టాస్మేనియా (Tasmania)
మౌంట్ వెలింగ్టన్ (Mount Wellington), బెన్ లోమాండ్ (Ben Lomond), క్రేడిల్ మౌంటెన్ (Cradle Mountain) వంటి ప్రాంతాల్లో మంచు పడుతుంది. ఇవి నిశ్శబ్దమైన, సహజ సుందరత కలిగిన ప్రాంతాలు.
దగ్గరి నగరాలు:
- హోబార్ట్ (Hobart)
- లాన్స్‌స్టన్ (Launceston)
🌄 4. ఆస్ట్రేలియన్ కాపిటల్ టెర్రిటరీ (ACT)
కాన్బెరా నగరంలో ఎక్కువగా మంచు పడదు, కానీ సమీపంలో ఉన్న నమాడ్జీ నేషనల్ పార్క్ (Namadgi National Park), టిక్బిన్బిల్లా (Tidbinbilla), బ్రిండబెల్లా రేంజెస్ (Brindabella Ranges) వంటి ప్రాంతాల్లో మాత్రం మంచు కురుస్తుంది.
షార్ట్ డ్రైవ్ లో మంచుతో కప్పబడిన పర్వతాలను చూడవచ్చు.
🏞️ 5. సదర్న్ క్వీన్స్‌లాండ్ (మంచు అరుదుగా కురుస్తుంది )
స్టాన్తోర్ప్ (Stanthorpe) మరియు గ్రానైట్ బెల్ట్ (Granite Belt) అనే ప్రాంతాల్లో చాలా అరుదుగా మంచు పడుతుంది. ఇది సాధారణంగా తక్కువ స్థాయిలో ఉండటంతో, అప్పుడప్పుడే జరిగే సహజ అద్భుతం లాగా ఉంటుంది.
చివరి మాట:
ఆస్ట్రేలియా మంచు దేశంగా ప్రసిద్ధి కాదు. కానీ కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రం మంచు ఖచ్చితంగా పడుతుంది. మీరు వేడి ప్రాంతాల నుంచి వలస వచ్చి ఉంటే, ఇక్కడ మంచు అనేది మీకు ఒక కొత్త అనుభవంగా ఉండొచ్చు. మంచు ప్రాంతాల్లో ఉద్యోగాలు, పర్యాటక అవకాశాలు, మరియు ప్రవాస వీసా అవకాశాలు కూడా ఉన్నాయి.
గమనిక: మంచు ప్రాంతాలకు వెళ్లేముందు జాకెట్లు, గ్లోవ్స్, మరియు స్నో చైన్లు తప్పకుండా తీసుకెళ్లండి