2025లో ఆస్ట్రేలియాలో ఉద్యోగ అవకాశాలు – Australia’s Job Market in 2025

2025లో ఆస్ట్రేలియాలో ఉద్యోగ అవకాశాలు ప్రస్తుతం నైపుణ్యాలున్న యువత, అంతర్జాతీయ విద్యార్థులు, కొత్త గ్రాడ్యుయేట్లకు భారీగా అందుబాటులో ఉన్నాయి. 2025లో ఆస్ట్రేలియాలో ఉద్యోగ అవకాశాలు అనగానే చాలామంది TR / PR తర్వాతే ఆలోచిస్తారు కానీ నిజానికి చదివే సమయంలో నుంచే మార్కెట్‌ను అర్థం చేసుకోవటం చాలా అవసరం.

ఆస్ట్రేలియా అనేది నైపుణ్యం ఉన్న వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థులు కోసం ఒక ఆకర్షణీయమైన గమ్య స్థానం. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ‘కోర్స్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది?’, ‘ఎప్పుడు TR/PR అప్లై చేయాలి?’ అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ నిజంగా ఎప్పుడైనా ఉద్యోగాల గురించి ముందుగానే ఆలోచించారా?ఆస్ట్రేలియాలో ఉద్యోగ అవకాశాలు

ఇటీవల విడుదలైన ప్రభుత్వ, ఇండస్ట్రీ రిపోర్ట్‌ల ఆధారంగా ఏ ఏ రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం.

🔥 2025లో ఆస్ట్రేలియాలో ఉద్యోగ అవకాశాలలో టాప్ డిమాండ్ ఉన్న రంగాలు Hottest Job Sectors in 2025

  1. ఐటీ & టెక్
  • రోల్స్: సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్, AI తదితర category లో
  • 💰 ప్రారంభ జీతం: $75,000 – $90,000
  • 🌍 యుఎస్, యూకేతో సమానంగా ఉంది
  1. హెల్త్‌కేర్ & నర్సింగ్
  • రోల్స్: నర్సులు, ఫిజియోథెరపిస్టులు, సోనోగ్రాఫర్లులకు
  • 💰 ప్రారంభ జీతం: $70,000 – $85,000
  • 📊 UK కంటే ఎక్కువ జీతం, కెనడాతో సమానంగా
  1. ఏజ్డ్‌కేర్ & డిసేబిలిటీ సపోర్ట్
  • రోల్స్: సపోర్ట్ వర్కర్స్, పర్సనల్ కేర్ అసిస్టెంట్లు (PCA)
  • 💰 జీతం: $55,000 – $75,000
  • 📈 పెరుగుతున్న వృద్దుల జనాభాతో ఏజ్డ్‌కేర్ & డిసేబిలిటీ సపోర్ట్ సెక్టార్ లో విస్తృత అవకాశాలు ఉన్నాయి.
  1. ఇంజినీరింగ్
  • రోల్స్: సివిల్, స్ట్రక్చరల్, ప్రాజెక్ట్ ఇంజినీర్లు
  • 💰 ప్రారంభ జీతం: $72,000 – $85,000
  • 👉 అనుభవం ఉన్నవారికి $130K కంటే ఎక్కువ
  1. బోధన రంగం (Teaching)
  • రోల్స్: మ్యాథ్స్, సైన్స్, అర్లీ చైల్డ్‌హుడ్ టీచింగ్
  • 💰 జీతం: $75,000 – $95,000
  • 🏞️ గ్రామీణ ప్రాంతాల్లో అదనపు బోనస్లు ఉన్నాయి
  1. నిర్మాణ రంగం (Construction)
  • రోల్స్: సైట్ మేనేజర్లు, ఎస్టిమేటర్లు, సేఫ్టీ మేనేజర్లు
  • 💰 జీతం: $80,000 – $100,000+
  • 🏗️ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆస్ట్రేలియా లో హౌసింగ్ నిర్మాణానికి చాల కొరత ఉంది, ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుల వలన డిమాండ్ పెరిగింది

💸 గ్రాడ్యుయేట్ జీతాల సారాంశంGraduate Salary Overviewగ్రాడ్యుయేట్

✅ చాలా మంది గ్రాడ్యుయేట్లు 1–2 సంవత్సరాల్లో $70K–$100K వరకు సంపాదిస్తున్నారు

🌍 ఇతర దేశాలతో పోలికAustralia vs USA vs UK (Salaries).పోలిక

🧠 చివరి మాట

ఒక వేల మీరు covid తర్వాత graduation పూర్తి చేసి ఉంటే, టెక్, హెల్త్, టీచింగ్ లేదా ట్రేడ్ రంగాల్లో ఉన్నా — 2025లో ఆస్ట్రేలియాలో మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి జీతాలు, పని-జీవిత సమతుల్యం, మరియు సహకార వాతావరణం మీకు మద్దతుగా నిలుస్తాయి. ఇ దేశం లో నచ్చే విషయం ఏమిటంటే ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ వర్క్ లైఫ్ బాలన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు.

Leave a Comment