తిరుమలలో NRI స్పెషల్ దర్శనం
మీరు ఎప్పడు India వచ్చినా మీ పేరెంట్స్ తీర్థయాత్రలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అయితే మీరు తిరుమలలో NRI స్పెషల్ దర్శనం గురించి తెలుసుకోవాల్సిందే, తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తుంటారు. మనకి దర్శనం అనగానే రోజుల తరబడి క్యూ లో వెయిట్ చేసే రోజులు, రద్దీ జనాలు గుర్తుకు వస్తారు. కానీ మీరు NRI అయితే విదేశాల్లో ఉండే భారతీయ పౌరుల (ఎన్.ఆర్.ఐ) కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
NRI స్పెషల్ దర్శనం అంటే ఏమిటి?
NRI స్పెషల్ దర్శనం అంటే రద్దీని బట్టి ఉండే గంటల తరబడి వెయిటింగ్, ఇబ్బందిని అధికమించి శ్రీవారిని దర్శించే ఒక సౌకర్యం. ఇది Non-Resident Indians (NRI), Overseas Citizens of India (OCI), Persons of Indian Origin (PIO), మరియు విదేశీయులకు లభిస్తుంది.
ఈ ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తిరుమల చేరుకున్న తర్వాత నేరుగా టికెట్లను పొందవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది, కానీ కొన్ని ముఖ్యమైన నిబంధనలు పాటించాలి.
- భారత్‌కు వచ్చిన తేదీ: మీరు భారత్‌కు వచ్చిన తర్వాత 30 రోజులలోపు ఈ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.
- ఓసీఐ (OCI) కార్డుదారులు: ఓసీఐ (Overseas Citizen of India) కార్డు ఉన్నవారు కూడా తమ ఓసీఐ కార్డుతో పాటు పాస్‌పోర్టును చూపించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
- కావాల్సిన పత్రాలు: దర్శనానికి వెళ్లే ముందు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి:
- మీ అసలు పాస్‌పోర్టు (Original Passport).
- పాస్‌పోర్టులోని వీసా మరియు ఇమ్మిగ్రేషన్ వివరాలు ఉన్న పేజీల జిరాక్స్ కాపీ.
- ఒక వేళ మీ వీసా passport లో ప్రింటెడ్ ఉండకపోతే మీరు మీ వీసా కాపీ ని సెపరేట్ గా చూపించాల్సి ఉంటుంది. Example: ఆస్ట్రేలియా వీసా
- కుటుంబ సభ్యులకు అనుమతి: ఈ ప్రత్యేక దర్శనం కేవలం ఎన్.ఆర్.ఐలకు మాత్రమే. వారి తల్లిదండ్రులు, బంధువులు, లేదా స్నేహితులకు ఈ క్యూలో ప్రవేశం ఉండదు.
దర్శనం ప్రాసెస్ – దశల వారీగా
- రిపోర్టింగ్: మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం 7:00 వరకు Special Darshan Queue Complex (ATC Circle) వద్ద రిపోర్ట్ చేయాలి.
- ఫారం నింపడం: వ్యక్తిగత మరియు వీసా వివరాలు నమోదు చేయాలి.
- పత్రాల ధృవీకరణ: TTD సిబ్బంది మీ డాక్యుమెంట్లు చెక్ చేస్తారు..
- టికెట్ కొనుగోలు: ఒక్కొక్కరికి ₹300 చెల్లించాలి.
- దర్శనం: టికెట్ కొన్న తర్వాత, మీరు ప్రత్యేక క్యూలోకి వెళ్లడానికి అనుమతించబడతారు.
టికెట్ ధర & సమయాలు
- టికెట్ ధర: ₹300 (12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితం)
- సమయం: 12:00 PM – 7:00 PM
- ప్రదేశం: స్పెషల్ దర్శన్ కాంప్లెక్స్, తిరుమల
సులభ దర్శనం కోసం చిట్కాలు
- వీలైతే వారంలో మధ్యలో లేదా సెలవులు లేని టైంలో (Weekdays) వెళ్లండి — రద్దీ తక్కువగా ఉంటుంది.
- సంప్రదాయ దుస్తులు ధరించండి (పంజా, చీర, సల్వార్).
- మొబైల్, కెమెరాలు, పెద్ద బ్యాగులు, చెప్పులు తీసుకెళ్ళవద్దు.
- డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం ఉంచండి.
- పక్కాగా ప్లాన్ చేస్తే దాదాపు 3-4 గంటలలో దర్శనం పూర్తిచేసుకోవచ్చు.
ముగింపు
Tirumala NRI Special Entry Darshan ద్వారా విదేశాల నుండి వచ్చే భక్తులు సమయం ఆదా చేసుకొని, శాంతియుతంగా, సులువుగా స్వామివారి సన్నిధిలో ప్రార్థన చేసేందుకు ఇది ఒక మంచి అవకాశం. సరైన పత్రాలు, సమయపాలన, మరియు భక్తి భావం — ఇవన్నీ కలిస్తే మీ యాత్ర మరింత పవిత్రమవుతుంది.
గమనిక: ఈ సమాచారం ప్రస్తుతమున్న టిటిడి నియమాలు మరియు మార్గదర్శకాల ఆధారంగా ఇవ్వబడింది. భవిష్యత్తులో ఎన్ఆర్ఐ ప్రత్యేక దర్శన సౌకర్యం, దాని నియమాలు లేదా సమయాలు అలాగే కొనసాగుతాయని మేము హామీ ఇవ్వలేము. కాబట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసే ముందు తాజా సమాచారం కోసం టిటిడిని సంప్రదించండి