ఏజ్డ్ కేర్ అంటే మన తల్లిదండ్రులు, బామ్మ-తాతలపై/వయస్సు పైబడిన పెద్దలపై మన ప్రేమను, ఆప్యాయతను గౌరవంగా చూపించడమే. ఏజ్డ్ కేర్ అనేది మనకి కొంచెం వినడానికి కొత్తగా ఉన్న వెస్ట్రన్ దేశాలలో తరచుగా ఉపయోగిస్తారు, ఇక్కడ మన దేశంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని కూడా అంటాము. బామ్మ-తాతలకు వయసు పెరిగేకొద్దీ, శక్తి క్షీణించి తమ రోజువారి పనులు, మందులు తినడం, ఆహారం తయారు చేయడం లేదా ఎవరితోనైనా మాట్లాడేందుకు కొంచెం సహాయం అవసరం పడుతుంది. ఇది కొంతమందికి ఇంట్లోనే అందుతుంది, మరికొంతమందికి ప్రత్యేక వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో trained staff సహాయం చేస్తారు.
సారాంశంగా చెప్పాలంటే, ఏజ్డ్ కేర్ అనేది వాళ్ల జీవితానికి గౌరవం ఇవ్వడమే — వాళ్లు మన కోసం చేసిన ప్రేమకి మనం ఇచ్చే ప్రత్యుత్తరం.
పాశ్చాత్య దేశా, దక్షిణాసియా దేశాలలో ఎలా పనిచేస్తుంది?
చాలా వరకు దక్షిణాసియా దేశాలలో మన తల్లిదండ్రులు, బామ్మ-తాతలు వయసు పైబడుతున్నప్పుడు, వారి కొడుకులు/కూతుళ్ల దగ్గరే నివసిస్తూ ఉంటారు. కానీ మారుతున్న కాలంలో నగరీకరణ, ఉద్యోగాన్వేషణ, మహిళలు పని చేయడం వంటివి కారణంగా కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రులను వారికి మానసికంగా, శారీరకంగా, మరియు జీవన సరళిలో సహాయం చేయాలన్న ఆలోచన మరలి ఓల్డ్ ఏజ్ హోమ్స్/ఏజ్ కేర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా హోమ్ నర్సులు, సీనియర్ లివింగ్ అపార్ట్‌మెంట్లు, డే కేర్ సెంటర్లు పెరుగుతున్నాయి.
కానీ, ఈ ఏజ్డ్ కేర్ ఎలా పనిచేస్తుందో మీరు ఎక్కడ ఉన్నారన్నదానిపై ఆధారపడి బాగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఇది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే ఒక ప్రొఫెషనల్ సిస్టమ్. కానీ భారతదేశం, ఇండోనేసియా వంటి దేశాల్లో ఇది ఎక్కువగా కుటుంబ విలువల మీద ఆధారపడిన వ్యవస్థ, అలా తల్లితండ్రులను వారి వృద్దాప్యంలో చూసుకొని వారిని సమాజంలో హీనంగా చూస్తారు.
ఇప్పుడు దీన్ని సమగ్రంగా అర్థం చేసుకుందాం.
వృద్ధుల సంరక్షణ/ఏజ్డ్ కేర్ అంటే ఏం చేస్తారు? – What is the concept of Aged Care?
వృద్ధులకు రోజూ అవసరమైన సేవలు అందించడమే వృద్ధుల సంరక్షణ అనేది, ఉదాహరణకు:
- స్నాన చేయడం, బట్టలు మార్చడం వంటి వ్యక్తిగత సహాయాలు
- మందులు ఇచ్చే పనులు
- పౌష్టికాహారం, శారీరక సంరక్షణ
- మానసిక సహాయం, ఒంటరితనాన్ని తగ్గించటం లాంటివి
- కొన్ని సందర్భాలలో 24/7 నివాస సంరక్షణ (nursing homes)
అంటే మొత్తంగా చూస్తే, వృద్ధుల సంరక్షణ/Aged Care/old age homes అనేది వృద్ధుల వ్యక్తిగత, మానసిక అవసరాలను తీరుస్తుంది.
పాశ్చాత్య దేశాల్లో ఏజ్డ్ కేర్ ఎలా ఉంటుంది?
ఉదాహరణగా: ఆస్ట్రేలియా – Australia
ఆస్ట్రేలియాలో aged care ప్రభుత్వ నిధులతో, కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో పనిచేస్తుంది. ఇక్కడ చాలా సంస్థలు ఈ సేవలను గవర్నమనెట్ నియమాలను పాటిస్తూ అందిస్తూ ఉంటాయి. వృద్ధుల అవసరాలను బట్టి వివాద సేవలు అందిస్తూ ఉంటారు.
- Home Care Packages – హోమ్ కేర్ సేవలు తమ ఇంట్లోనే ఉండే వృద్ధుల ఇంటికి వచ్చి అందిస్తుంటారు.
- Residential aged care homes – 24 గంటలు సేవలు అందించే ప్రత్యేక కేంద్రాలు కూడా ఉంటాయి, అందులో ఆహారం, మానసిక సహాయం, నర్సింగ్ సపోర్ట్ లాంటివి అందిస్తారు
- వృద్ధుల ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం పూర్తిగా లేదా పార్షికంగా ఈ సేవలకు రాయితీని అందిస్తుంది.
- ACAT అంచనా అవసరం – వృద్ధులు సబ్సిడీ సేవలు పొందాలంటే ACAT అనే సంస్థ అర్హత అంచనా చేస్తుంది, తదనంతరం అర్హులైతే సబ్సిడీ పొందవచ్చు.
- శిక్షణ పొందిన స్టాఫ్ – ఈ సేవలలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులు, వ్యక్తిగత అసిస్టెంట్లు వృద్ధుల క్షేమలాభాలు చూడటానికి ఉంటారు.
🛂 నాన్-ఆస్ట్రేలియన్ పౌరులు ఏజ్డ్ కేర్ కు అర్హులా? – Non Australian Citizens are eligible for Aged Care?
సాధారణంగా, ఆస్ట్రేలియన్ పౌరులు మరియు పర్మినెంట్ రెసిడెంట్లకే ప్రభుత్వ నిధులతో aged care అందుతుంది.
- టెంపరరీ వీసా ఉన్నవారు లేదా విజిటర్లు – ప్రభుత్వ సహాయం పొందలేరు
- ప్రైవేట్ aged care సౌకర్యాలు పొందవచ్చు, కానీ పూర్తి ఖర్చు తామే భరించాలి
- కొన్ని ప్రత్యేక సందర్భాల్లో (ఉదా: హ్యూమానిటేరియన్ కేసులు) మినహాయింపులు ఉండవచ్చు, కానీ అరుదుగా
అందుచేత, మీ తల్లిదండ్రులు పర్మినెంట్ రెసిడెంట్‌లు కాకపోతే, aged care ఖర్చు మీకు ఎక్కువవుతుంది.
దక్షిణాసియా దేశాల్లో ఏజ్డ్ కేర్ ఎలా ఉంటుంది?
ఉదాహరణలు: భారతదేశం, ఫిలిప్పీన్స్, వియత్నాం – India, Philippines, Vietnam
ఇక్కడ aged care అనేది ఎక్కువగా కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది.
- తల్లిదండ్రులు పిల్లలతో ఉండటం సర్వసాధారణం
- ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ మాత్రమే ఉండే పరిస్థితి – ఇవి ఎక్కువగా నగరాల్లోనే
- సామాజిక గౌరవం – వృద్ధులను ఇంట్లోనే చూసుకోవడం సంప్రదాయంగా గొప్పగా భావిస్తారు, అలా చేయకపోతే గౌరవ హీనంగా భావిస్తారు.
- ప్రభుత్వ సహాయాల కొరత – పెద్దల కోసం ప్రత్యేక పథకాలు తక్కువనే చెప్పాలి.
- మానవ సంబంధాలు, ఆధ్యాత్మిక విలువలు ఏజ్డ్ కేర్ లో కీలకం
🌐 భవిష్యత్తులో aged care దిశ
ఇప్పుడు రెండు ప్రాంతాల్లో aged care మారుతోంది:
- పాశ్చాత్య దేశాల్లో స్టాఫ్ కొరత ఉంది – దక్షిణాసియా నుండి caregiverలకి డిమాండ్ ఉంది
- దక్షిణాసియాలో టెక్నాలజీ ఆధారిత aged care అభివృద్ధి చెందుతోంది
- టెలీహెల్త్, emergency డివైసెస్ వంటి టెక్ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి
ఈ మార్పులతో కలిసి వచ్చే పద్ధతులు మిశ్రమ aged care కావచ్చు – కుటుంబ ప్రేమతో పాటు ప్రొఫెషనల్ సేవలు.
👩⚕️ aged care లో ఉద్యోగ అవకాశాల గురించి – Job Opportunities in Aged Care
మీరు నర్సింగ్, హెల్త్‌కేర్, పర్సనల్ కేర్ వంటి రంగాల్లో ఉన్నారా? అయితే ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో aged care చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడ వీసా మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
💬 చివరి మాట
ఏ దేశంలోనైనా ఏజ్డ్ కేర్ అంటే ఒకటే అర్థం – మనల్ని చిన్నప్పడినుండి కానీ, పెంచిన తల్లితండ్రులను/పెద్దలను వారికి అవసరమైన రోజులలో గౌరవంగా, ప్రేమతో చూసుకోవడం. ఈ సేవా మనోభావం మనం వృద్ధులమయ్యే సమయంలో కూడా అవసరం అవుతుందని గుర్తుచేసుకుందాం.